వ్యవహారిక భాష ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అని ఆంగ్ల అధ్యాపకురాలు, జింకల మోహన్ వల్లి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన వల్లి మాట్లాడుతూ గ్రాంధిక భాషలో ఉన్న పద్యాలకు అర్థాలు తెలియని పరిస్థితుల్లో గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు వంటి తెలుగు భాషా ప్రేమికులు 1930 లోనే ఉద్యమాలు చేశారన్నారు.