మంగళగిరి: మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన దాసెట్టి వెంకటేశ్వరరావు (48) అప్పుల బాధ తాళలేక ఆదివారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మంగళగిరి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుని కుమారుడు దాసెట్టి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబసభ్యులకు అందజేయనున్నట్లు చెప్పారు.