కట్నం తీసుకుని, పెళ్లి వాయిదా వేస్తున్న అబ్బాయిని నడిరోడ్డులో యువతి పట్టుకుంది. తప్పించుకుని పారిపోయినా, వెంటపడి మరీ తనను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. ఈ ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో సోమవారం జరిగింది. రోడ్డుపై హంగామా చూసి పోలీసులు రావడతో అసలు విషయం తెలిసింది. నిశ్చితార్థం అయ్యాక కట్నం తీసుకుని పరారయ్యాడని, తీరా ఇప్పుడు కనిపించాడని పట్టుబడ్డ వ్యక్తి గురించి ఆ యువతి తెలిపింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.