ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్లీ గింజలతో కలిగే లాభాలివే

Life style |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 10:46 AM

బార్లీ గింజలు పోషకాలను అందిస్తాయి. ఇవి వేసవిలో సహజసిద్ధమైన ఔషధంలాగా పనిచేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, శక్తిని అందిస్తాయి.


- బార్లీ గింజల్లోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.


- బార్లీలో క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను కూడా బార్లీ అందిస్తుంది.


- బార్లీ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


- బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలనూ అదుపులో ఉంచుతుంది.


- బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలుపుకొని తాగితే వేసవిలో శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.


- బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి. 3 కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అలాగే 2 చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. 10 నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com