శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో వర్షం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వరుణ దేవుడా కరుణించవా అంటూ నిట్టూర్చుతున్నారు. ఇటీవల ఒక మోస్తరులో వర్షాలు పడటంతో రైతులు పెద్దఎత్తున నాట్లు వేశారు. అయితే ఆ తర్వాత వర్షాలు పడలేదు. ఒక వేల వర్షాలు పడినా. అంతంత మాత్రంగానే వచ్చాయి. చెరువులు సైతం నిండని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నియోజకవర్గ పరిధిలో 28 వేల హెక్టార్ల వరకూ వరకూ ఖరీఫ్ లో సాగు చేస్తున్నారు. ఇందులో కేవలం 8 వేల హెక్టార్లకు మాత్రమే సాగునీటి కాలువల ద్వారా సాగునీరు పూర్తిస్థాయిలో అందుతుంది. మిగిలిన భూములు చెరువులు, వర్షాధారంగానే సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో చెరువులు కూడా నిండలేదు. నాట్లు వేసిన తర్వాత వరి సాగులో నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడకపోవడంతో నష్టపోతామనే ఆందోళన రైతులల్లో నెలకొంది.