గుజరాత్ సూరత్‌లోని ఉఢానాలో ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెక్స్టైల్ మిల్లులో పని చేసే రోహిత్ సింగ్, సోనమ్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే జూన్ 27న రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతడు పెట్టిన ఫేస్బుక్ పోస్టును అతడి స్నేహితుడు తాజా చూడడంతో అసలు విషయం వెల్లడైంది. భార్య, బావమరిది తనతో బీఫ్ తినిపించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రోహిత్ పేర్కొన్నాడు.