ప్రాంతీయ భేదం తలెత్తకుండా దేశానికి 5 రాజధానులుండాలని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ప్రతి జోనుకు ఒకటి చొప్పున 5 రాజధానులు అవసరమని, అప్పుడే ఢిల్లీలాంటి ఒకేచోట మొత్తం సంపద పోగుబడకుండా ఉంటుందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్తో ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని లండన్, పారిస్ మాదిరిగా మారుస్తానని చెప్పిన కేజ్రివాల్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.