మైదుకూరు మండలంలో ఉన్న ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అధిక ధరలకు ఎరువులను రైతులకు అమ్మినట్లు మా దృష్టికి వస్తే ఆ దుకాణాలను సీజ్ చేస్తామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని జీవి సత్రంలో ఎరువుల దుకాణాలలో అధిక ధరలతో విక్రయిస్తున్న సమాచారాన్ని తెలుసుకొని ఎరువుల దుకాణాలను సీజ్ చేశారు. దుకాణంలోని 645 ఎరువుల బ్యాగులను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగినట్లు ఏవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు.