బీచ్లో స్నానానికి దిగిన ఇంటర్ విద్యార్థి జగదీష్ మృతదేహం లభ్యమైంది. సోమవారం గల్లంతైన చోటే మృతదేహం ఆచూకీ కనుగొన్నారు. గోస్ట్గార్డ్స్ సిబ్బంది విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. అశీల్మెట్టలోని నారాయణ కళాశాలలో ఎంపీసీ తొలి సంవత్సరం చదువుతున్న జగదీష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఆర్కేబీచ్కు వెళ్లిన విషయం తెలిసిందే. అంతా కలిసి స్నానం చేస్తున్న సమయంలో భారీ అలకు జగదీష్ కొట్టుకుపోగా మిగిలిన స్నేహితులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.