సిపీఎస్ రద్దు కోరుతూ కొన్ని ఉద్యోగ సంఘాల వారు సెప్టెంబర్ 1వ తేదీ తలపెట్టిన మిలియన్ మార్చ్-ఛలో విజయవాడ & సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమాలకు పోలీస్ వారి తరపున ఎటువంటి అనుమతులు లేవు. ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని,క్రిమినల్ కేసులు నమోదు చేసి,అరెస్ట్ చేయడం జరుగుతుంది అని పల్నాడు జిల్లా పోలీస్ శాఖా తెలియజేసింది.
సిపీఎస్ రద్దు కోరుతూ చలో విజయవాడ,ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి సంబంధించి జిల్లాలో ఎటువంటి నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు, ముట్టడి కార్యక్రమాలు మరియు ధర్నాలు వంటి వాటిని నిర్వహించరాదు.
చట్ట ఉల్లంఘనకు పాల్పడిన ఉద్యోగులపై Andhra Pradesh Civil Services ( Classification, Control and Appeal) Rules, 1991 ప్రకారం కూడా శాఖా పరమైన మరియు చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేస్తాం. పై విషయాలన్నీ గమనించి ఉద్యోగులు, సంబంధిత వర్గాలు అనుమతి లేని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ తెలియజేశారు.