వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అనంతపురం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీలు మరియు గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం కార్యక్రమాలలో పాటించాల్సిన నియమ, నిబంధనలు మరియు ఆయా సందర్భాలలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో క్షుణ్ణంగా తెలియజేశారు.