సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 95 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ గారు బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు.
ఇప్పటి వరకు 2,162 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలో 2,023 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు. సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన " CHAT BOT" సేవలకు మంచి స్పందన లభించడమే కాకుండా విశిష్ట గుర్తింపు లభించింది. ఇందుకు గాను టెక్నాలజీ సభ- 2022 అవార్డు రెండ్రోజుల కిందట జిల్లా ఎస్పీ గారు కలకత్తాలో అందుకున్న విషయం తెలిసిందే.
పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది.