రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఆ క్రీడల్లో యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. యువకులతో పోటీ పడి మరీ ఓ వృద్ధుడు కబడ్డీ ఆడాడు. కబడ్డీ కోర్టులో కూతకు వెళ్లి, తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానంటూ సందేశమిచ్చాడు.