గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతుల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్‌లోనే భారత్-పాక్‌ల మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లతో పాటు క్వాలిఫయర్ హాంకాంగ్ కూడా గ్రూప్ ‘ఎ’లో భాగమైంది. ప్రతి గ్రూప్‌లోని టాప్ 2 జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. హాంకాంగ్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్ రెండూ విజేతలుగా నిలుస్తాయని దాదాపుగా ఖాయం. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంతో గ్రూప్ 'ఎ'లో భారత్ టాపర్‌గా నిలవనుంది. సెప్టెంబర్ 3 నుంచి సూపర్ 4 దశ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న అంటే ఆదివారం ఏ1, ఏ2 జట్లు తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.