కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. పాచిపెంటకు చెందిన తూముల కృష్ణవేణి(25) కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఈనెల 26న ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగారు.
అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు వెంటనే సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూసోమవారం మృతిచెందారు. ఈమెకు భర్త శ్రీను, ఇద్దరు పిల్లలున్నారు. తల్లి అన్నపూర్ణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.