విజయనగరం, కురుపాం: బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఓటు కార్డుతో ఆధార్ అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఓటరు ఒక చోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 7, 75, 054 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 3, 95, 519 మంది కాగా పురుషులు 3, 79, 535 మంది ఉన్నారు. వీరిలో ఇంతవరకు 50 వేల మంది ఓటర్లు ప్రకారం 6. 5 శాతం మంది మాత్రమే చేసుకున్నారు. దీనిపై ఎన్నికల అధికారులు ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు.