దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,564 పాయింట్లు లాభపడి 59,537 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు పెరిగి 17,759 వద్దకు చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని బజాజ్ ఫిన్‌సర్వ్ (5.47%), బజాజ్ ఫైనాన్స్ (4.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.15%), టెక్ మహీంద్రా (3.96%), ఐసిఐసిఐ బ్యాంక్ (3.72%) లాభాల్లో ముగిశాయి.