ఏపీ ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా ఉండటం సరికాదని ధ్వజమెత్తారు. ఉద్యోగుల నిరసనకు అనుమతి ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. ఉద్యోగుల జోలికి వెళ్లి, పార్టీని ఉద్యోగులకు దూరం చేయొద్దన్నారు. కుప్పంలో అన్న క్యాంటీన్లపై దాడి దుర్మార్గమని ఫైర్ అయ్యారు.