దేశీయ అవసరాల కోసం తగినంత బఫర్ బియ్యం నిల్వలు ఉన్నాయని.. బియ్యం ఎగుమతులను నిషేధించే అంశం తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. బియ్యం ఎగుమతులపై పరిమితి విధించేందుకు కొన్ని చర్చలు జరిగినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. చైనా తర్వాత బియ్యం ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.12 కోట్ల టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది