గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సెప్టెంబర్ 2న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయతలపెట్టిన ముఖ ఆధారిత హాజరు సమస్యలు, సాధ్యాసాధ్యాలు తదితరాలపై చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. అనంతరం ఫేషియల్ ఆప్ హాజరు గురించి తదుపరి FAPTO నిర్ణయిస్తుందని తెలియజేసారు.