సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్ట్ చేయడం అన్యాయమని.. ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ నేతలు చేశారు. రేపు కలెక్టరేట్ల వద్ద నల్ల బ్యా డ్జీలతో నిరసన తెలుపుతామన్న ఎన్జీవోలు.. సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాటం ఆగదని, సీపీఎస్ రద్దుపై జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.