పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కణాల రక్షణ, కొలాజెన్ తయారీలో చాలా కీలకంగా ఉంటుంది. పైనాపిల్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం కోసం తోడ్పడే మాంగనీస్ కూడా పైనాపిల్ లో దండిగా ఉంటుంది. పైనాపిల్ లో ఉండే బ్రొమెలేన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. బ్రొమెలేన్ వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.