సెప్టెంబర్ 20 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఆ దేశ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ మరియు భారత్‌లకు ఈ సిరీస్ కీలక సన్నాహక టీ20 సిరీస్‌గా ఉపయోగపడుతుంది. కాకపోతే టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కీలకంగా మారనున్న డేవిడ్ వార్నర్‌కు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెలక్షన్ కమిటీ అతడిని ఈ సిరీస్‌కు తీసుకోలేదు. భారత పర్యటనకు వార్నర్ స్థానంలో కెమెరూన్ గ్రీన్ ఎంపికయ్యాడు.
సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23న రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గురించి ఆస్ట్రేలియన్ సెలక్షన్ ప్యానెల్ చీఫ్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, 'గ్రీన్ కామెరాన్ ఇటీవల అన్ని అంశాలలో చాలా మెరుగుపడింది. అతనిని T20 ఫార్మాట్‌లో అతని ఆల్ రౌండ్ నైపుణ్యాలను ఉపయోగించుకోవచ్చు. అతని ఎంపిక పట్ల మేము సంతోషిస్తున్నాము అన్నాడు.