మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్ఖి గ్రామంలో వర్షం కారణంగా ఇంటి గోడ కూలి ఇద్దరు బాలికలు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతులను 11 ఏళ్ల అనామిక, ఐదేళ్ల అంజలిగా గుర్తించినట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్బి ప్రజాపతి తెలిపారు.ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.