బీపీసీఎల్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. తన కస్టమర్లకు 15 రోజులకు ఒకటే సబ్సిడీ సిలిండర్ అంటూ పరిమితి విధించింది. అంటే ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్ బుకింగ్ మధ్య 15 రోజుల విరామం ఉండాలి. ఐవోసీ, హెచ్ పీసీఎల్ ఇంకా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవి కూడా అనుసరించొచ్చు.
ఇదిలావుంటేవాణిజ్య సిలిండర్ వినియోగదారులకు మరికాస్తంత ఊరట దక్కింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.91.50 మేర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఇవి ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. దీంతో ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,976 నుంచి రూ.1,885కు దిగొచ్చింది. ఆగస్ట్ 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.36 తగ్గడం గమనార్హం. అంతేకాదు జులైలోనూ ధర 8.5 శాతం మేర తగ్గింది. ఇదిలావుంటే ఇక ఇళ్లల్లో వినియోగించే ఎల్పీజీ సీలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలే కొనసాగుతాయి.