వాట్సాప్ లో కాలనుగుణంగా మార్పులు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త అప్షన్ వాట్సాప్ లో వచ్చేసింది. వాట్సాప్ లో మనకు మనమే మెస్సేజ్ ఎలా చేసుకోవడం? అన్న సందేహం వచ్చిందా? నిజమే వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకురావడంపైనే పనిచేస్తోంది. ఇది కనుక అమల్లోకి వస్తే యూజర్లు తమ నంబర్ కు తామే మెస్సేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం టెలిగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా సదుపాయం ఉంది.
కొన్ని సందర్భాల్లో కొన్ని ఫొటోలు, లేదా యూఆర్ఎల్ లింక్ లు, ఫైల్స్ సేవ్ చేసకోవాలని అనిపించొచ్చు. కానీ, ఎలా..? వాట్సాప్ లో అయితే మరొకరికి పంపిస్తే కానీ, అది రికార్డ్ రూపంలో ఉండదు. ఫోన్ లో నోట్స్ అనే ఫైల్ లో సేవ్ చేసుకోవచ్చు. కానీ, వాట్సాప్ లో ఉంటే కావాల్సినప్పుడు వేగంగా యాక్సెస్ చేసుకుని, మరొకరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్ భవిష్యత్తు అప్ డేట్ లో ఈ ఫీచర్ రానుంది. ఈ విషయాన్ని వా బీటా ఇన్ఫో తెలిపింది. ఈ సంస్థ నిత్యం వాట్సాప్ కు సంబంధించిన తాజా సమాచారాన్ని వెలుగులోకి తీసుకొస్తుంటుంది.