ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంట్లో అందరూ బుధవారం గుడికి వెళ్లగా, దివ్యాంగుడైన బాలుడు మాత్రమే ఉన్నాడు. దీంతో ఆ బాలుడిని ఆ ఇంట్లో పని చేసే వ్యక్తి హత్య చేసి, బంగారం, సెల్ఫోన్, రూ.40 వేల నగదుతో పరారయ్యాడు. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశాడు. విచారణలో 1996లో వచ్చిన 'తు చోర్ మైన్ సిపాహి' సినిమా స్పూర్తితో హత్య చేసినట్లు చెప్పడంతో పోలీసులు విస్మయమొందారు.