ప్రయాణికులకు స్వల్ప ఊరట కలిగిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏసీ బస్సు ఛార్జీలో 20శాతం వరకు తగ్గిస్తూ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల ద్వారా వెల్లడించింది. ఎంతమేర బస్సు ఛార్జీ తగ్గించాలనే నిర్ణయాధికారాన్ని ఆర్టీసీ రీజినల్ మేనేజర్(ఆర్ఎం)లకు చేతిలో పెట్టింది. శుక్రవారం, ఆదివారం మినహా ఈ ఛార్జీలు వర్తిస్తాయి.