స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయంట్లు లాభపడింది. అలాగే నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి నష్టాలతో స్థిరపడింది. మారుతి, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వంటి కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల షేర్లు లాభాలతో స్థిరపడ్డాయి.