తమ రాష్ట్రంలోని చిన్నారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి వరకు విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదని పేర్కొంది. దీనిపై మధ్యప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులు స్కూల్ బ్యాగుల బరువు కూడా తగ్గించాలని, వారానికి ఒకసారి బ్యాగులు లేకుండా విద్యార్థులు స్కూలుకు వచ్చేలా చూడాలని పేర్కొంది.