అరటిపండులో ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, బీ6, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా కాపాడతాయి. ఒక అరటిపండు గుజ్జుకు చెంచా ఆర్గానిక్ తేనె, కప్పు పెరుగు, 2 చెంచాల ఆలివ్‌నూనె కలిపి, ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు రాయాలి. అరగంట ఆరనిచ్చి జుట్టును కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. తేనె జుట్టుకు మెరుపునిస్తుంది. ఆలివ్‌నూనె చుండ్రును పోగొడుతుంది.