దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండోది గుజరాత్, మూడోది దక్షిణ భారతదేశంలోని ఏపీకి బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేస్తే.. దాని మీద యనమల అత్యంత అన్యాయంగా లేఖ రాశాడు అని మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు.
బల్క్ డ్రగ్ పార్కు విషయంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది.. గ్రామాలు నష్టపోతాయి.. పర్యావరణ ఇబ్బందులు వస్తాయి.. మా ప్రాంతానికి నష్టం చేకూరుతుందని నిసిగ్గుగా కేంద్రానికి, యనమల లేఖ రాశాడు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి.. ఆ జిల్లాకు బల్క్ డ్రగ్ పార్కు రాకుండా నిసిగ్గుగా అడ్డుపడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే అనుమతులు ఇస్తారా..? అని ప్రశ్నించారు.