యుద్ధం చేయాలంటూ టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన చంద్రబాబు... కార్యకర్తలను బలి చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. సొంత పార్టీలోనే చంద్రబాబును నమ్మడంలేదని, అందుకే గొడవలు చేయాలంటూ కార్యకర్తలను ఎగదోస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు కుప్పంలోనే కుదేలయ్యాడని, ఇక పులివెందులను తాకే ధైర్యం ఉందా? అని అన్నారు.
రెండు లక్షల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, ఆ ఆంశంపై చర్చలకు రాగలరా? అని ప్రశ్నించారు. ఒకవేళ చర్చా వేదిక ఎక్కడో చెబితే తామే వస్తామని స్పష్టం చేశారు. డీబీటీ ద్వారా తాము రూ.1.70 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని జోగి రమేశ్ వెల్లడించారు. అవినీతి కేసుల విచారణ జరగనివ్వకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa