టీడీపీ ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి గాంధీ మీద దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే అయినా దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, అంతకు ముందు తూర్పు నియోజకవర్గం అంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ప్రజలను భయపెట్టడానికి ఈ దాడి చేశారని, దాడి చేసినటువంటి వ్యక్తులను ఎవర్ని వదిలే ప్రసక్తి లేదన్నారు