పుదుచ్చేరిలోని కారైక్కాల్ లో దారుణం జరిగింది. తన కొడుకు కంటే మణికందన్ అనే విద్యార్ధికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని విక్టోరియా అనే మహిళ కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇవ్వడంతో మణికందన్ మరణించాడు. దీంతో పోలీసులు విక్టోరియాను అరెస్ట్ చేశారు. 8వ తరగతి చదువుతున్న మణికందన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.