భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ లో మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కేవలం 8 రోజుల్లో రెండోసారి తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్ మైదానంలో పోరు రసవత్తరంగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 సంవత్సరాల తర్వాత 8 రోజుల వ్యవధిలో ఇరు జట్లు రెండోసారి తలపడడం ఇదే తొలిసారి. అంతకుముందు 2018 ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరగగా, రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా