పచ్చి కూరగాయలు తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయలలో క్యారెట్, బీట్‌రూట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఆకుకూరలు కట్ చేసి సలాడ్‌లుగా చేసి మిరియాల పొడితో కలిపి తినవచ్చు. ఇవి విటమిన్ సి, బి కాంప్లెక్స్, బి6 మరియు ఫోలిక్ యాసిడ్‌లను అందిస్తాయి. దగ్గు, జలుబు కూడా రావు. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. కూరగాయల్లో పీచుపదార్థం ఉండడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు.