ప్రస్తుత సీజన్లో విరివిగా లభించే సీతాఫలాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, చర్మ సమస్యలపై పోరాడే విటమిన్ ఏ, బీ5, సీ, జింక్, కాపర్ లభిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు సీతాఫలంలో ఉంటాయి. ఇక డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడంతో పాటు మెదడును చురుగ్గా తయారు చేస్తుంది. దీనిలోని ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.