ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై..ఇప్పటికే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. ఇదంతా భాజపా కుట్ర అని మండిపడిన సోరెన్..తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు.
వారిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రిసార్టుకు తరలించారు. తమ మెజార్టీ నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే సరైన మార్గం అని భావించారు. ఇప్పుడు ఈ పరీక్షలో నెగ్గారు. ఇందులో సోరెన్ సర్కార్‌కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వెంటనే భాజపా సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.