సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల భేటీ జరగ్గా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం -జగన్.. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ పెట్టుబడులు ఏపీ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయన్న సీఎం.. భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. దీని ద్వారా 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుందన్నారు.