వైయస్సార్ చేయూత పథకం దరఖాస్తు స్వీకరణ గడువును సెప్టెంబర్ 8 వరకు ప్రభుత్వం పొడిగించింది. 45-60 ఏళ్ల వయసున్న SC, ST, BC, మైనార్టీ మహిళలకు ఈ పథకం ప్రభుత్వం ఏటా రూ.18,750 ఇస్తోంది. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12వేల ఆదాయం , 3 ఎకరాల్లోపు మాగాణి, విద్యుత్ బిల్లు 300 యూనిట్లలోపు, ఆదాయపు పన్ను చెల్లించని వారు అర్హులు. లబ్ధిదారులు కులధృవీకరణ పత్రం, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేయాలి.