కర్ణాటక మాజీ మంత్రి, పలు విద్యాసంస్థల అధినేత ప్రభాకర్ రాణె సోమవారం కన్నుమూశారు. వైరల్ ఫీవర్ రావడంతో నెల క్రితం ఆసుపత్రిలో ఆయన చేరారు. ఇటీవల డిశ్చార్జ్ అయి, ఇంట్లోనే ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. 1993లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో మంత్రిగా ఆయన పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.