ప్రస్తుత టీమ్ ఇండియా లైనప్ కాంబినేషన్ వర్కవుట్ కావడం లేదని, అక్షర్ పటేల్‌తో పాటు మరో పేసర్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా అన్నాడు. రవీంద్ర జడేజా లేకపోవడంతో సరైన తుది జట్టును ఎంపిక చేయడంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ చాలా గందరగోళంలో పడింది. గత కొన్ని నెలలుగా ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లను జట్టుకు ఓపెనర్లుగా ఉపయోగిస్తున్నారు. అయితే తుది జట్టులో సూర్య తప్ప ఇతర ఆటగాళ్లు ఉండే అవకాశాలు 50-50 ఉన్నాయి. ఆసియా కప్ టోర్నీకి ఇషాన్ కిషన్ ఎంపిక కాని సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులు చేసింది. వీరిలో రవీంద్ర జడేజా గాయం కారణంగా, అవేష్ ఖాన్ జ్వరం కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే వారి స్థానంలో దీపక్ హుడా, రవి బిష్ణోయ్ జట్టులోకి రాగా, దినేష్ కార్తీక్ స్థానంలో పంత్ వచ్చాడు. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంతో, ఆసియా కప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. దీంతో శ్రీలంకతో పోరు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. భారత్ ఓడిపోతే ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోతుంది. తాజాగా చటేశ్వర్ పుజారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దీని పై పుజారా స్పందిస్తూ.. ప్రస్తుత కాంబినేషన్ టోర్నీలో పనిచేయడం లేదని భావిస్తున్నట్లు తెలిపాడు. మరో బౌలింగ్ ఆల్ రౌండర్ రావాలని కోరుకుంటున్నట్లు పుజారా చెప్పాడు. మూడో సీమర్‌ని కూడా జట్టులో ఉపయోగించుకోవాలని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, పేస్ ఆల్‌రౌండర్‌ను అన్ని సమయాలలో పూర్తి కోటాను బౌలింగ్ చేయడానికి ఉపయోగించలేమని చెప్పాడు.