దేశంలో నిజమైన తుక్డే తుక్డే ముఠా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 'తుక్డే-తుక్డే' చేయడానికి కుట్ర పన్నుతున్న, సామాజిక సామరస్యాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని వారు దెబ్బతీస్తున్నారని రాగిణి అన్నారు. ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఆ పదం సరిగ్గా సరిపోతుందన్నారు.