చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా ప్రభావంతో చైనాలోని 33 నగరాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. కరోనా ఆంక్షల కారణంగా అధికారులను ప్రజలను బయటకు రానివ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. చైనాలో ముఖ్యమైన 30 సిటీల్లో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించిందని అక్కడికి మీడియా సంస్థలు నివేదించాయి. అయితే వీటి వల్ల ట్రాన్స్ పోర్ట్ పై, ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ లాక్ డౌన్ ఎంత కాలం పాటు ఉంటుందనే విషయంలో అక్కడి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. త్వరలో చైనాలో స్కూల్స్ కు సెలవులు రానున్నాయి.