ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ కేవీలో ఫుడ్ పాయిజన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 01:00 PM

కాకినాడ రూరల్ వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 5, 6 తరగతి గదుల్లో ఊపిరి ఆడకపోవడంతో 30 మంది విద్యార్ధులు స్పృహ‌ కోల్పోయారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.


మిగిలిన విద్యార్ధులను స్కూల్ నుంచి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఏ కారణంతో పిల్లలు ఇలా కళ్లు తిరిగి పడిపోయారన్నది తెలియాల్సి ఉంది. కేంద్రీయ విద్యాలయ టీచర్లు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com