గుంటూరు జిల్లా, గుంటూరు నగరం నందు ఎ.సి. కాలేజ్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. ఎంతో చరిత్ర కలిగిన కాలేజీ కావడమే కాకుండా, ఎంతో మంది రాజకీయ నాయకులూ , సినిమా ప్రముఖులు చదువును అభ్యసించిన ఘనత కలిగిన కళాశాల గా గుర్తింపు పొందింది. . ఐతే, సెప్టెంబర్ 5న డా॥ సర్వేపల్లి, రాధ కృష్ణ గారి జన్మ దినముని పురస్కరించుకొని, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం మొదలు కొని రాత్రి వరకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కలిసి వారి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపల్ A. గురవయ్య గారు అధ్యక్షత వహించగా, సీనియర్ - అధ్యాపకులు 7 వెస్లీ గారు, శానియలు గారు, కిరణ్ గారు, ప్రకాష్ రావు గారు, పాల సునీత గారు, ప్రేమలత గారు, పూజిత గారు, అపర్ణ దేవి గారు , అమృత గారు, నాన్ టీచింగ్ స్టాప్ మరియు విద్యార్థి , విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా , సమాజం పట్ల అవగాహనా, ఉన్నత విద్య ఆవశ్యకత లాంటి అంశాలపై ఉపాధ్యాయులు , విద్యార్ధులకి అవగాహనా చేసారు. అనంతరం పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.