సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 89 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన " CHAT BOT" సేవలకు మంచి స్పందన లభిస్తోంది.
పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/మిస్ అయిన సెల్ ఫోన్లు అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 2,243 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలో 2,112 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఈ.నాగేంద్రుడు, జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగం ఎస్సై సుధాకర్ యాదవ్ మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.