నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం ఘోరం జరిగిందీ. పోలీసుల కథనం మేరకు నక్కల కాలనీ చెందిన బాధితురాలు ఓ రిటైర్డ్ టీచర్ కుమార్తె. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం బాలిక పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన దగ్గరి బంధువు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి యత్నిం చాడు. బాలిక ప్రతిఘటించింది. తప్పించుకునేందుకు బాత్ రూములో దూరింది. అతనూ బాత్రూములోకి ప్రవే శించి, అక్కడ ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకొని, ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు.
అంతటితో ఆగకుండా కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. యాసిడ్ వల్ల ముఖం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా బాలిక మారిపోయింది. బాలిక కేకలు విని చుట్టుపక్కలవారు ఆమె తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి బాలికను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతు కానికి పాల్పడింది తన అల్లుడేనని చుట్టుపక్కలవారు చెబు తున్నారని బాలిక తండ్రి మీడియాకు తెలిపారు.
ఈ విషయం మీద స్పందించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... ఆ పసిబిడ్డను చూస్తే మీకు ఏమనిపిస్తుంది జగన్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని నెల్లూరు వెళ్తారు మీరు? మహిళల,చిన్నారుల మాన ప్రాణాలను కాపాడటం మీ బాధ్యత కాదా?
అధికారం కేవలం అనుభవించడానికే కాదు. ఘోరం జరిగాక వెంటనే కాస్త సొమ్ము విసిరి, బెదిరించి బాధితుల నోర్లు మూయించడానికి కాదు మీకు CM కుర్చీ ఘోరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమని.. తప్పు చేస్తే తక్షణమే శిక్ష తప్పదు అన్న భయం నేరస్తులలో లేదు ఈరోజు.. నేను తప్పు చేస్తే సీఎం వాళ్ళకి ఓ రెండు లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తాడులే అన్నట్లుంది వారి ప్రవర్తన. నంబర్లు చూపించుకోవడం కోసం మగవారితో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం వల్ల ఏమిటి ప్రయోజనం? మూడేళ్ళు గడిచినా, నేటి వరకూ మీరు చెప్పిన దిశ అనేది చట్టం కాలేదు. ఇదా మీ చిత్తశుద్ధి? అని ప్రశ్నించారు.