వంగర మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం అధికారులు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్కు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ప్రతినిధులు నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం సుమారుగా 55 కుటుంబాలకు 0. 60 సెంట్లు చొప్పున ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూముల్లో, ప్రభుత్వ స్థలం లో అక్రమంగా నిర్మిస్తున్న బీపీసీఎల్ పెట్రోల్ బంకు, రోడ్డు ను తొలగించి వారికి న్యాయం చేయాలని కోరారు. వంగర తహసిల్దార్ కు డి. ఐజాక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీవెన్స్ లో పలువురు అధికారులు, ఎంపీడీవో శంకర్రావు, సూపరింటేడెంట్ త్రినాధులు తదితరులు హాజరయ్యారు.